కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేతకు ఈడీ నోటీసులు

కాకినాడ పోర్టు వివాదంలో, వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, వివిధ కారణాల వల్ల విజయ సాయి విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేస్తూ, సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

కాకినాడ సీ పోర్టు లిమిటెడ్, సెజ్లో కర్నాటి వెంకటేశ్వర రావు వాటాలను బలవంతంగా లాక్కున్నారని విజయసాయిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కేవీ రావు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని, ఈడీ విచారణ ప్రారంభించింది. దర్యాప్తులో విజయసాయిరెడ్డి మనీ లాండరింగ్ కేసులో అనుమానితుడిగా గుర్తించబడ్డారు.

ఈ నేపథ్యంలో, ఇప్పటికే జారీ చేసిన నోటీసులకు వివిధ కారణాలతో విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కాలేకపోయారు. తాజా నోటీసులపై ఆయన విచారణకు హాజరవుతారా లేక మరింతగా  వివాదాలను పెంచుకుంటారో వేచి చూడాలి.

తాజా వార్తలు