హైదరాబాద్, 17 జనవరి 2025: కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా, హైదరాబాద్ మహానగరంలో వంద శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారిని ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, ప్రధాన మంత్రి ఈ-డ్రైవ్ (PM E-Drive) పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా బస్సులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి చేసిన ప్రతిపాదనలను గుర్తుచేశారు.
ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ కిట్ అమర్చి, రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుకునే అవకాశంపై కూడా సీఎం గారు కేంద్ర మంత్రికి దృష్టి సారించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పోరిక బలరాం నాయక్, కె. రఘువీర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది నగరంలోని వాయు కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు మహత్తర భాగస్వామ్యం అవుతుంది, అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.