బుద్ధ భవన్‌లోని హైడ్రా (HYDRA) కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి ఈరోజు భారీ స్పందన లభించింది. ప్రతి సోమవారం ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందన
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా, అందిన ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టాలని, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఫిర్యాదుల స్వీకరణ కొనసాగనుంది.
హైడ్రా ఏర్పాటు వెనుక కారణం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రా సంస్థను ఏర్పాటు చేసింది. హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టి, అక్రమ నిర్మాణాలను తొలగించే బాధ్యతను అప్పగించింది.
హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయ్
ఈ క్రమంలో, నగరంలోని చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తూ ముందుకెళ్తోంది. ప్రజలు తమ భూములతో సంబంధమైన సమస్యలను హైడ్రా ప్రజావాణి ద్వారా తెలియజేయొచ్చని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఏవీ రంగనాథ్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.