ఏపీలో మద్యం ధరల తగ్గింపుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలు
ఏపీ కూటమి ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడం ద్వారా ప్రాతిపదికగా ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
“రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరను (రూ. 99/180 ఎంఎల్) తగ్గించాలనే నిర్ణయం తీసుకుంది, కానీ మందులు లేదా విద్యా సంస్థల ఫీజులను తగ్గించట్లేదు. ఇది మద్యపానాన్ని, గృహ హింసను పెంచుతుందని, ప్రజారోగ్యాన్ని మరింత దిగజారుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యతలపై సందేహం కలుగుతోంది” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.