మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా నిరంతరం కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటున్నారు.

అలాగే తనతో పాటు ప్రభుత్వంలోని మంత్రులు ఇప్పటి నుండి వారానికి రెండు రోజులు కాంగ్రెస్ పార్టీ  గాంధీభవన్ ఆఫీస్ లో ఒక్కోరోజు ఒక మంత్రి అందుబాటులో ఉంటారని, ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 02.00 గంటలకు రోజుకు 3గంటలు, అందుబాటులో ఉంటారని అది ఈ వచ్చే బుధవారం ప్రారంభించనున్నారు

ఇక వారానికి రెండు రోజుల పాటు గాంధీ భవన్ కు మంత్రుల సందర్శన

ప్రజలు, కార్యకర్తల తో మంత్రుల ముఖాముఖి ..

ఆదివారం నాడు జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు చర్చించుకుని గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి షెడ్యూల్ ను ఖరారు చేశారు..

*ఈ బుధవారం నుండే ప్రారంభం*

*ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు*

*తొలి రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర రాజనర్సింహ*  తో ప్రజలు ,కార్యకర్తలతో ముఖాముఖి.

ప్రతి బుధ, శుక్రవారాలలో ఒక్క మంత్రి గాంధీ భవన్ కు రావాలని సూచించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

పార్టీ అధ్యక్షుడు మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచడానికి, అలాగే కార్యకర్తల సమస్యలను నేరుగా తీర్చడానికి ఇదో గొప్ప ఆలోచనే అని చెప్పాలి.

మొత్తానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి అలాగే పార్టీ కార్యకర్తలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలల్లో ఆనందం కలిగిస్తుంది.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా చేర్చేలా కార్యకర్తలను ఇప్పటి నుండే ఇంకా బలంగా భాగస్వామ్యం చేసేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తుంది.


Discover more from Elite Media Telugu News

Subscribe to get the latest posts sent to your email.

Discover more from Elite Media Telugu News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading