తెలంగాణ వ్యాప్తంగా ఫార్మూల ఈ రేస్ కేసు పై మరోసారి చర్చ మొదలైంది. ఈ కేసులో ఏ1 గా కేటీఆర్ ను ఏసీబీ విచారణకు నోటీసులు జారీ చేసింది. కానీ అక్కడే ఆయన ఓ మెలిక పెట్టి ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ కేటీఆర్ ఏమంటున్నారు..? ఏం జరుతుందనేది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ..
బీఆర్ఎస్ హయంలో.. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ వేదికగా ఫార్మూల ఈ రేస్ జరిగింది. ఇందులో కేబినేట్ ఆమోదం లేకుండా కేటీఆర్ నిర్వహకులకు 54 కోట్ల రూపాయాలను చెల్లించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా రంగంలోకి దిగింది.కేటీఆర్ సహా పలువురు అధికారులపై కేసు పెట్టింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది.అసలు, కేటీఆర్‌పై ఈడీ మోపిన అభియోగాలు ఏంటి..? ఏ కారణాలు చూపుతూ కేసు నమోదు అయ్యిందనే విషయానికి వస్తే.. హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్‌కి సంబంధించి.. రూల్స్‌కి విరుద్ధంగా 54కోట్ల 88లక్షల రూపాయల్ని విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లించారనేది అభియోగం.ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు లేకుండా.. డబ్బు చెల్లించారనేది ప్రధాన అభియోగం.కేటీఆర్ ఆదేశాలతో రూల్స్‌కి విరుద్ధంగా FEOతో ఎంవోయూ చేసుకున్నారని.. 600కోట్లు చెల్లించేలా ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు ఒప్పందం చేసుకున్నారనేది మరో అభియోగం. అసలు, ఎంవోయూకి ముందే కేటీఆర్ ఆదేశంతో డబ్బు చెల్లించేశారని.. ఆ తర్వాతే సీఎంవోకి సమాచారం ఇచ్చారన్నది ఇంకో అభియోగం కేబినెట్ ఆమోదం లేకుండా ఇలా డీల్ చేసుకోవడం.. ఆర్టికల్ 299 ఉల్లంఘన అంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఏసీబీ. మోసం, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యల కింద కేటీఆర్‌పై అభియోగాలు మోపింది ఏసీబీ. ఆ 55 కోట్ల చుట్టూనే ఇప్పుడు పంచాయితీ..! పాలనాపరమైన అనుమతుల్లేకుండా అంత మొత్తం ఫారిన్ కంపెనీకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు.. అది కూడా డాలర్లలో ఎందుకిచ్చారు..! ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. ఆగమేఘాలపై ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సూత్రధారులెవరు..! ఇదే తేల్చనుంది ఏసీబీ.
మరోవైపు కేటీఆర్ మాత్రం ఎక్కడా అవినీతి జరగలేదని చెబుతున్నారు. ఏసీబీ విచారణను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ను కోర్టులో సవాల్ చేశారు కేటీఆర్. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తీర్పు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు 7న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం నందినగర్ లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. ఆ సమయంలో కేటీఆర్ పక్కన అడ్వకేట్ ఉండటంతో.. పోలీసులు ఆయన కారును గేటు వద్ద ఆపారు. అయితే అడ్వకేట్లతోనే లోపలకి వెళ్తానని.. వారి సమక్షంలోనే విచారణ జరగాలన్నారు కేటీఆర్. అడ్వకేట్లను అనుమతించబోమని ఏసీబీ అధికారులు చెప్పారు. అలా కోర్టు ఆర్డర్ లో లేదన్నారు. ఈ క్రమంలో అధికారుల రెస్పాన్స్ కోసం అరగంట పాటు ఆఫీసు గేటు బయటే వేచి చూసిన కేటీఆర్.. ఏసీబీ అడిషినల్ ఎస్పీకి తన వివరణ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఇలా కేటీఆర్ ఓ వైపు ఏసీబీ, మరోవైపు ఈడీల నోటీసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.