చైతన్యపురి డివిజన్ మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని

చైతన్యపురి: చైతన్యపురి డివిజన్ నందు మూసి పరివాహక ప్రాంతాలను సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు ఈ సందర్భంగా మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న అటువంటి ప్రజలు భయాందోళన గురవుతున్నారని ప్రభుత్వం తన వైఖరి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని మూసి సుందరీకరణ కోసం హైడ్రా ప్రాజెక్టును తీసుకోవచ్చారా లేదా వరద ప్రభావిత ప్రాంతాలకు ముప్పు వాటిల్లకుండా తీసుకోవచ్చారా, ప్రభుత్వ భూములు అక్రమలకు గురైన చోట ఈ హైడ్రాన్ ఉపయోగిస్తున్నారా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉందని దీనిపై ప్రభుత్వం స్పందించి ఒక వైట్ పెపర్ ను విడుదల చేయాలని అసలు మూసి పరివాహక ప్రాంతాల్లో ఎన్ని లక్షల ఇల్లు ఉన్నాయి, ఎక్కడ వాటిలో ముప్పుకి గురవుతున్నాయి అనేది గుర్తించాలని అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురి అయినట్లయితే అక్కడ నివసిస్తున్న పెద వారికి జీవో నెంబర్ 58 ప్రకారం క్రమబద్ధీకరణ చేసి వారికి అప్ప చెప్పాలని జీవో నెంబర్ 59 ప్రకారం మధ్య తరగతికి పైబడిన వాళ్ళు ఉంటే ప్రభుత్వం సిస్తూ ప్రకారం వారి నుండి కొంత వసూలు చేయొచ్చు గాని నిర్దాక్షిణ్యంగా ఏళ్ల తరబడి నివసిస్తున్న మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను భయాందోళన గురి చేయవద్దని ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం పై ఒక అపనమ్మకం ఏర్పడుతుందని వారు తెలియజేశారు ఏదేమైనా హైడ్రా పేరుతో ప్రజలను భయాందోళన గురి చేయవద్దని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్,కలని పెద్దలు శ్రీనివాస్, అశోక్,మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు


Discover more from Elite Media Telugu News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Discover more from Elite Media Telugu News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading