ఘనంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన నేతలు
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశమని.. తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ ల లక్ష్యమని టీడీపీ నేతలు అన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయ 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నేతలు కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి కేంద్ర కార్యాలయం గుండెకాయ వంటిదన్నారు. భారతదేశంలో ఏ పార్టీ కార్యాలయంలో కూడా ప్రజలకు భోజనం పెట్టి వారి సమస్యలను పరిష్కరించడంలేదన్నారు. కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే ఇలా జరుగుతుందని తెలిపారు.
టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయ సిబ్బంది కమిట్ మెంట్‌తో పనిచేస్తున్నారని.. ప్రతినిత్యం కార్యకర్తలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. శతవసంతాలపాటు పార్టీ వర్ధిల్లేలా అన్న ఎన్టీఆర్ ఆశయ స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దేవాలయంగా ప్రజల గుండెల్లో టీడీపీ కేంద్రాలయం ఉంటుందన్నారు.
టీడీపీ కార్యకర్తలకు దేవాలయమైన పార్టీ కార్యాలయంపై దుర్మార్గులు చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీలా కాకుండా ప్రజలకు సేవ చేసే స్వచ్ఛంద సంస్థలా పనిచేస్తుందని తెలిపారు. ప్రజలకు పేదరికాన్ని దూరం చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపి.. తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు.
సభ్యత్వంతో కార్యకర్తల కుటుంబాలకు భరోసా
దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిన గొప్ప పార్టీ తెలుగుదేశం అన్నారు. సాధారణ సభ్యత్వ రుసుము రూ.100 కాగా, ఈ ఏడాది నుంచి కొత్తగా శాశ్వత సభ్యత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. దీని రుసుము రూ.1,00,000 ఉందన్నారు.
పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు టీడీపీ సాయం
విద్యార్థుల చదువు కోసం 1,670 మందికి రూ.2 కోట్లు 35 లక్షలు, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు 180 మందికి, ఎన్‌టిఆర్, ఇతర విద్యా సంస్థల ద్వారా 4,732 మందికి సాయం చేశామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు:
ప్రభుత్వ సలహాదారు ఎమ్ఏ షరీఫ్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు, కౌన్సిల్ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీదర్, మరియు ఇతర పార్టీ నేతలు.