ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టిన హిందూ ద్రోహి, హిందూ ధ్వేషి జగన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్సి జగన్ దెబ్బతీశారు. స్వామివారి ప్రసాదంలో జగన్ చేసిన పాపం గురించి తెలుసుకున్నాక ప్రతిరోజు, ప్రతి హిందువు వెంకటేశ్వరుడి ముందు నిలబడి క్షమించమని కోరాల్సిన పరిస్థితి వచ్చింది. జరగరాని తప్పు జరిగిపోయింది క్షమించమని వేడుకోవాల్సి వచ్చింది. ఎంతో భక్తి భావంతో నైవేద్యంగా సమర్పించే ప్రసాదాన్ని జగన్ ప్రభుత్వం అపవిత్రం చేసింది. భక్తులకు అందించిన ప్రసాదంలో యానిమెల్ ఫ్యాట్ ఉండడం క్షమించరాని నేరం. రాష్ట్రాన్ని పాలించిన ఒక దుర్మార్గుడు చేసిన పాపం ఇది. జంతు పదార్థాలతో మిళితమై, కలుషితమైన నెయ్యితో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలను తయారు చేయడం మహా అపచారం. ఘోరమైన పాపం జరిగింది స్వామీ దయచేసి మమ్మల్ని క్షమించండి స్వామీ అని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందువు వేడుకుంటున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి క్షమించమని వేడుకునేలా జగన్ చేశాడు. జగన్ అనే హిందూ ద్రోహి, ధ్వేషిని ప్రపంచం క్షమించదు. పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని, మన జీవితంలో ఇటువంటి వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. తిరుపతి ప్రసాదంలో యానిమెల్ ఫ్యాట్ కలిసిందన్న వార్త ల్యాబ్ రిపోర్టు ద్వారా తేటతెల్లమైంది. లడ్డూ ప్రసాదంలో యానిమెల్ ఫ్యాట్ ఉందన్న వార్త వినగానే ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది. ఇంత స్పష్టంగా ల్యాబ్ రిపోర్టు ఆధారంగా తప్పు బయటపడినా.. మీడియా ముందుకొచ్చి జగన్ బుకాయిస్తున్నాడు. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఇంత ఘోరమైన తప్పు చేసి సిగ్గు లేకుండా బుకాయించడమా? జగన్ మీడియా ముందుకొచ్చి ఇలా కామన్ గా జరుగుతుంటుందని మాట్లాడటం తప్పు. జగన్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే సమయంలో జగన్ ముఖంలో బాధ అనేది ఏ కోశాన లేదు. అయ్యో ఇంత పాపం జరిగిందా అనే పాశ్చాత్తాపం జగన్ లో ఎక్కడ కనబడలేదు. ఇంతటి పాపం కలలో కూడా ఎవరూ చేసి ఉండరు.

జగన్ చెప్పేవన్నీ అబద్దఆలే :
తిరుపతి ప్రసాదం లడ్డూ విషయంలో జగన్ అన్నీ అబద్దాలు వండి వార్చారు. చంద్రబాబు అబద్దాలు మాట్లాడారని జగన్ అంటున్నాడు. ఆ భగవంతుడే నాతో నిజం మాట్లాడించాడని చంద్రబాబు గారు చెప్పారు. ఏ ఆర్ ఫుడ్ నుంచి నేతి కొనుగోలు ప్రారంభం అయింది జగన్ హయాం నుంచే అతను దిగిపోయే నాటికి నెయ్యి కొనుగోలు కు సంబంధించిన టెండరు మార్చి 12, 2024 న పిలిస్తే.. మే 8, 2024న ఏఆర్ ఫుడ్ కు అనుకూలంగా టెండర్ ఖరారు చేసి మే 15, 2024న నెయ్యి కొనుగోలు పర్చస్ ఆర్డర్ కూడా విడుదల చేశారు. ఆ మరుసటి రోజు నుండే ఏ ఆర్ ఫుడ్స్ టీటీడీకి కలుషిత నెయ్యి సరఫరా ప్రారంభించింది. జూన్ 12న ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీకి నూతన ఈవో శ్యామలర్ రావు నియామకం జరిగిన తరువాత చంద్రబాబు గారు ప్రసాదాల నాణ్యత విషయమై భక్తుల నుండి పదే పదే వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ప్రసాదాలు, అన్నదానాలకు సంబంధించి వాడుతున్న ముడి సరుకుల నాణ్యతను పరీక్షించమని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం ఏఆర్ ఫుడ్స్ వారు సరఫరా చేస్తున్న నెయ్యి పై కూడా దృష్టి సారించి దానిలో నాణ్యతా లోపం ఉందని ప్రాథమికంగా గుర్తించి మరిన్ని సాంకేతికపరమైన పరీక్షల కోసం గుజరాత్ లోని ఎన్డీడీబీ ల్యాబ్ కు నెయ్యి శాంపిళ్లను పంపడం జరిగింది.

జులై 12 వ తేదిన మాత్రమే ఏఆర్ ఫుడ్ నుంచి నెయ్యి వచ్చిందంని జగన్ అంటున్నారు. ఆ తర్వాత నెయ్యే రాలేదంటున్నారు. ఇందులో అర్థంలేదు. జులై నెలలో చంద్రబాబే ముఖ్యమంత్రి అనే రీతిగా మాట్లాడుతున్నాడు. మా ప్రభుత్వం లేదని జగన్ బొంకుతున్నాడు. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలు నిజాలు తెలుసుకోవాలి. మార్చి 12, 2024న నెయ్యి కొనుగోలుకు టెండర్ పిలవడం జరిగింది. ఆ సమయంలో సీఎం ఎవరో జగన్ చెప్పాలి. మే 15 నుంచి ప్రారంభమై టీడీపీ అధికారంలోకి వచ్చిందో శ్యామలరావుగారిని ఈవోగా నియమించారో తెలుసుకోవాలి. గత 5 సంవత్సరాల కాలంలో లడ్డూ ప్రసాదాలపై, అన్నదానాలపై అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది. స్వామివారి భక్తులు ధర్నాలు కూడా చేశారు. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చలనం లేదు. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఛైర్మన్ బీమా నాయక్ 2013 నుంచి 2018 మధ్య టీటీడీకి, నందినికి దాదాపుగా 4 వేల టన్నుల నందినీ ఘీ సరఫరా చేసిందని కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఛైర్మన్ చెప్పారు. 2019లో 2 వేల టన్నుల నెయ్యి ఐదేళ్ల జగన్ పాలనలో ఎన్నో ఆలయాలు కూల్చేశారు. జగన్ హయాంలో రథాలు తగులబెట్టారు.. విగ్రహాలు పగలగొట్టారు. జగన్ రెడ్డి హిందూ ద్రోహి. రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తాడేపల్లి కొంపలో కూర్చుని పైశాచిక ఆనందం పొందుతున్నారు. జగన్‌రెడ్డి.. నువ్వు యాంటీ హిందువువి. ప్రధానికి జగన్‌రెడ్డి లేఖ రాయడం విడ్డూరం. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ప్రధానికి లేఖ రాస్తున్నావు. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.

తెలుగు దేశం హయాంలో వేల టన్నుల స్వచ్ఛమైన నందిని నెయ్యి సరఫరా చేయడం జరిగిందని కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఛైర్మన్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ ని కూడా యూట్యూబ్ లో చూడొచ్చు. జగన్ వి అన్నీ పచ్చి అబద్దాలు. నరేంద్ర మోడీకి రాసిన లేఖలో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఏది రాస్తే అది గొర్రెల్లా నమ్మేస్తారని జగన్ అనుకుంటున్నాడు. ఏదైన రిపోర్టు గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు మనం ఆ రిపోర్టులో ఎన్ క్లోజ్డ్ మెన్షన్ రిపోర్టు కాపీ అని పెట్టి ఆ రిపోర్టును ఎన్ క్లోజ్ చేస్తాం. అనిమెల్ ఫ్యాట్ లేదని నిర్ధారించారని చెబుతున్నారు. చెప్పినప్పుడు ఆ కాపీని ఎందుకు జతచేయలేదు? రిపోర్టులో తాటికాయంత అక్షరాలతో ఉంది. లాడ్, బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ ఉన్నట్లు తాటికాయంత అక్షరాలతో రాసి ఉంది. ఈ విషయాలు జగన్ కు తెలుసు. వాస్తవాలు తెలిసి బుకాయిస్తున్నావు. నీ లేఖకు కనీసం రిపోర్టు కాపీని కూడా జతచేయలేదు. జగన్ చేసిన పాపమేంటో జగన్ కు తెలుసు. అందుకనే రిపోర్టు కాపీని జతపరచలేకపోయారు.
ఈ రిపోర్టులో కొన్ని స్పెషల్ కండిషన్స్ రిపోర్టులో మెన్షన్ చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వీళ్ల ఫైండింగ్స్ నిజం కాకపోవచ్చు. ఈ రిపోర్టు పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. కామెన్సెన్స్ గా ఆలోచించాలి. ఆవులో కొన్ని లోపాలుంటే రిపోర్టులో తేడా ఉండొచ్చని రాశారు. ఒక్క ఆవు వేల టన్నుల నెయ్యి తయారు చేసే పాలు ఇచ్చేస్తుందో అని ఆలోచించాలి. సూపర్ కౌస్ ఎక్కడా లేవు. జగన్ ఆలోచనా ధోరణి సరిగా లేనట్లు స్పష్టమౌతోంది. ప్రెస్ మీట్ లో రిపోర్టు చదవడానికే కిందా మీద పడ్డాడు. నీకున్న చదువు పరిజ్ఞానమేంటో ప్రెస్ మీట్ లో చూపారు. ప్రజల్ని ఏదో ఒక విధంగా తప్పుదోవ పట్టించాలనేదే జగన్ ఉద్దేశం. పచ్చి అబద్దాలు వండి వార్చుతున్నారు. జగన్ చేసిన పాపం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక హిందువుకి స్పష్టంగా అర్థమైంది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నీ దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు. అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ వేయడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడదు. దీని వెనుక ఉన్న పాపాత్ములందరికి కఠినాతికఠినమైన శిక్ష పడాలని ప్రపంచంలోని హిందువులతోపాటు అన్ని మతాలవారు కోరుకుంటున్నారు.


Discover more from Elite Media Telugu News

Subscribe to get the latest posts sent to your email.

Discover more from Elite Media Telugu News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading