తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతుండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నాయని, దాడులకు తెగబడుతున్నారని కవిత మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై స్పందించిన కవిత, ఈ చర్యను “పిరికిపంద చర్య” అని వీరి నినాదం తేవడం సరికాదు అన్నారు. “కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉందని” ఆమె వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్న “మొహబ్బత్ కీ దుకాన్” అన్నదానికి ఇదేనా? అని ప్రశ్నిస్తూ, “ఇలాంటి హింసా రాజకీయాలను తెలంగాణ తిరస్కరిస్తుంది” అని కవిత స్పష్టం చేశారు. అలాగే, “హింసకు, విధ్వంసకర చర్యలకు తెలంగాణలో తావులేదు” అని మండిపడిన ఆమె, కాంగ్రెస్ పార్టీ తన యువజన విభాగాన్ని గూండాల విభాగంగా తీర్చిదిద్దుతోందని ఆరోపించారు.
తదుపరి, “ఇలాంటి సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతార” అని కవిత పేర్కొన్నారు.