TTD Darshanam Quota: తిరుమల శ్రీ వారి ఆర్జితసేవా టికెట్ల జూన్ నెల కోటాను మంగళవారం విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
