Tribal Acts: గిరిజన హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఏజెన్సీలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.