Tirupati Crime : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. గ్రామస్తులతో కలిసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.