TG EAP CET Applications: తెలంగాణలో ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం కానుంది. 15శాతం నాన్ లోకల్ కోటాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా అది మార్చి 1కు వాయిదా పడింది.