వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ రోజు పార్లమెంట్లోకి వస్తున్న సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన సొమ్మసిల్లి పడిపోయారు, దీంతో తక్షణం ఆయనకు సహాయపడిన సిబ్బంది, వైద్యులకు సమాచారం అందించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఈ ఘటన గురించి మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ, “పిల్లి సుభాష్ చంద్రబోస్ కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సిబ్బంది స్పందించి, వైద్యులకు సమాచారం అందించారు. పార్లమెంట్లోనే ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు” […]