బాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ తో సరికొత్త ప్రస్థానం!

తెలుగు దర్శకులు హిందీ చిత్ర పరిశ్రమలో మంచి స్థానం సంపాదించుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేస్తూ, తెలుగులో ఉన్న టాలెంట్‌ను హిందీకి తీసుకురావడమే కాదు, అటువంటి ప్రాజెక్టులను కూడా విజయవంతంగా విడుదల చేస్తోంది.

తెలుగు దర్శకులు హిందీ చిత్ర పరిశ్రమలో తమ అదృష్టాన్ని పరీక్షించడం కొత్త విషయం కాదు. ఎన్నో కాలాల క్రితం రాఘవేంద్రరావు, వంటి సీనియర్ డైరెక్టర్లు హిందీ చిత్రాలను తెరకెక్కించారు. తరువాత రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు కూడా బాలీవుడ్లో తమ టాలెంట్‌ను ప్రదర్శించారు. తాజాగా, సందీప్ రెడ్డి వంగా ‘కబీర్ సింగ్’ మరియు ‘యానిమల్’ చిత్రాలతో బాలీవుడ్లో తనదైన స్టైల్ ను చూపించారు. గోపీచంద్ మలినేని: హిందీకి అడుగుపెట్టిన తొలి చిత్రం : […]