రాష్ట్ర గవర్నర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన స్టాలిన్

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇటీవల మరింత ప్రాధాన్యం పొందాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించారు. గవర్నర్ తమ బాధ్యతలను రాజ్యాంగం ప్రకారం నిర్వహించకుండా, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోవడం వివాదానికి కేంద్ర బిందువైంది.జాతీయ గీతాన్ని ఆలపించకపోవడం, అనుచితంగా సమావేశం విడిచిపెట్టడం […]