సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ పాన్ ఇండియా హీరో సినిమా వాయిదా పడినట్లేనా?

ఇదే రోజున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతోందని ప్రచారం జరుగుతోంది. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, సిద్ధు సినిమా విడుదల తేదీని అదే రోజుకు ప్రకటించడంతో ‘ది రాజా సాబ్’ వాయిదా దాదాపు ఖాయమైంది.