దర్శకులతో ఫ్లాపు అందుకున్న స్టార్ హీరోలు.. !
ఏదేమైనా సొంత బాషలో వండర్స్ క్రియేట్ చేసిన కోలీవుడ్ దర్శకులు…. తెలుగులో సత్తా చాటలేకపోవడం ఆశ్చర్చాన్ని కలిగిస్తోంది.కోలివుడ్ డైరెక్టర్ లు తెలుగు లో నేరుగా సినిమాలు చేయడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమే. గతంలో కే.బాలచందర్, మణి రత్నం, కే.యస్.రవికుమార్, సురేష్ కృష్ణ, మురగదాస్ వంటి వాళ్లు తెలుగులో సినిమాలు తీసి మెప్పించే ప్రయత్నం చేశారు. తాజాగా ఈ లిస్టులో దర్శకుడు శంకర్ కూడా చేరారు. అయితే తమిళంలో భారీ హిట్లు అందుకున్న దర్శకులు.. తెలుగులో అనుకున్న స్థాయిలో తమ మేనియాను సాగించలేకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం గా మారుతోంది.