తెలంగాణ హైకోర్టులో గుండెపోటుకు గురైన సీనియర్ న్యాయవాది మృతి

తెలంగాణ హైకోర్టులో ఓ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. 21వ కోర్టు హాలులో వాదనలు వినిపిస్తుండగా, సీనియర్ న్యాయవాది వేణుగోపాలరావు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. ఈ ఘటనతో హైకోర్టు లో ఉన్న తోటి న్యాయవాదులు, కేసు విచారణకు హాజరైన వారంతా షాక్‌కు గురయ్యారు. వేణుగోపాలరావు కోర్టులో ఒక కేసు విషయమై వాదనలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నేలకొరిగారు. వెంటనే స్పందించిన న్యాయమూర్తి, తోటి న్యాయవాదులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే న్యాయవాది మృతి చెందినట్లు […]