కలర్ ఫుల్ ఫ్రేమ్ మిస్ అయిందంటోన్న మెగాఫ్యాన్స్.. !

కలర్ ఫుల్ ఫ్రేమ్ మిస్ అయిందంటోన్న మెగాఫ్యాన్స్

మెగా ఫ్యామిలీ సభ్యులు ఈ ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీలో ప్రధాని మోడీ తో కలిసి సంక్రాంతికి ని జరుపుకోగా… రామ్ చరణ్ ఉపాసన క్లీంకార తో కలిసి జరుపుకున్నారు. అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సెలబ్రెట్ చేసుకున్నాడు. వరణ్ తేజ్ లావణ్యతో… యంగ్ హీరోలు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తమ స్నేహితులతో కలిసి పండగను జరుపుకున్నారు. ఇలా ఎవరికివారే ఈ ఏడాది సంక్రాంతి పండుగను కానిచ్చేశారు. అయితే దీనికి కారణం.. హెడ్‌ ఆఫ్‌ ద హోం మెగాస్టార్‌ చిరంజీవి హైదరాబాద్‌లో లేకపోవడమా, లేక ఇరు కుటుంబాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల వల్ల కామ్‌గా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది