బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేయనున్నారా? మహేశ్ బాబుతో జక్కన్న మాస్టర్ ప్లాన్

ఇప్పటికే ప్రియాంక చోప్రా SSMB29లో హీరోయిన్ గా నటిస్తుందని అనుకున్న అభిమానులు ఇప్పుడు గజిబిజి అయ్యారు. తాజా సమాచారం ప్రకారం, ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా కాకుండా విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. .

బాహుబలి 2తో భారతీయ సినీ ఇండస్ట్రీకి కొత్త గమ్యాన్ని నిర్దేశించిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ఆ సినిమా తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌తో మరో భారీ విజయం అందుకున్నారు. అయితే, ఆయన స్వయంగా సృష్టించిన బాహుబలి 2 రికార్డును ఇప్పటికీ అందుకోలేకపోయారు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌తో తన రికార్డును బ్రేక్ చేయాలని రాజమౌళి సిద్ధమవుతున్నారు.