ఒకే ఒక్కడు పుష్పరాజ్‌ ..రికార్డ్స్ విషయంలో నూ తగ్గేదేలే ..!

ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ప్రస్తుతం చాలా ఆకర్షణగా మారింది. అల్లు అర్జున్ నటించిన రప్పా రప్పా మాస్ యాక్షన్ సీన్, వెస్ట్రన్ దేశాల ఆడియెన్స్‌ను మరింత మెప్పించింది. ఈ యాక్షన్ సీన్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. అనేక మంది మార్వెల్ హీరోలతో పోల్చి, బన్నీ (అల్లు అర్జున్) యాక్షన్‌లో మరింత పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నాడని చెప్పుతున్నారు.

టాలీవుడ్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్‌ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదలైన మొదటి రోజునే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, నాన్‌స్టాప్‌ ట్రెండ్‌గా నిలుస్తోంది. పుష్పరాజ్‌ దంచికొట్టిన బాక్సాఫీస్ రికార్డులు : ప్రేక్షకుల అంచనాల మేరకు పుష్పరాజ్‌ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ను […]