పవన్ కల్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు – ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం భారీ అంచనాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ జంటగా నటించిన “గేమ్ చేంజర్” సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు ఏపీలోని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ప్రసంగంతో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. […]