హరిహర వీరమల్లు నుండి లేటెస్ట్ అప్ డేట్

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొంటూ యాక్షన్ మోడ్‌లోకి మారారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక వర్కింగ్ స్టిల్ విడుదల చేయగా, అది అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని మేకర్స్ తెలిపారు.