ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) పై భయాందోళనలు: వైద్యుల స్పష్టం

ఆంధ్రప్రదేశ్ లో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) గురించిన భయాందోళనలు కదిలిస్తున్న నేపథ్యంలో, విశాఖపట్నంలోని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద స్పందించారు. జీబీఎస్ వల్ల ఏవైనా మరణాలు సంభవించలేదని స్పష్టం చేసిన ఆయన, ఈ వ్యాధి అంటువ్యాధి కాదని వెల్లడించారు. విశాఖలో జీబీఎస్ బాధితుల కోసం కేజీహెచ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్టు డాక్టర్ శివానంద తెలిపారు. ఇప్పటి వరకు ఐదు అనుమానిత కేసులు వచ్చిన విషయం గురించి మాట్లాడిన ఆయన, బాధితుల బ్లడ్ శాంపిల్స్ […]