బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ లో సమావేశం: అవిశ్వాసం, ఇతర కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో మంగళవారం బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టే అంశం ప్రధాన చర్చాంశంగా మారింది. ఈ అవిశ్వాసంపై తగిన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన కార్పొరేటర్ల బలం, వారి సంఖ్య, అంగీకారాన్ని ఎలా పొందాలి అనే విషయాలపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, […]