సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నిహారిక స్పందన

‘పుష్ప2’ సినిమా ప్రీమియర్ షోలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనపై సినీనటి నిహారిక తొలిసారి స్పందించారు. ఈ ఘటనతో ఆమె మనస్సు బాధగా ఉందని పేర్కొన్నారు. “ఇలాంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి,” అని నిహారిక చెప్పుకొచ్చారు. మృతి చెందిన మహిళ విషయాన్ని తెలుసుకుని ఆమె చాలా బాధపడ్డారని, అందరి మద్దతుతో అల్లు అర్జున్ ఈ బాధ నుంచి తేలికపడ్డారని చెప్పారు. తన తాజా చిత్రం ‘మద్రాస్ కారన్’ ప్రమోషన్లలో భాగంగా […]