వింటేజ్ చిరు” వార్తలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్‌!

ఈ సినిమా కథ 90ల కాలం హైదరాబాద్‌కు చెందిన ఓ గ్యాంగ్‌స్టార్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించనున్నారు. పీరియాడిక్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకమైన కథ సిద్ధం చేశారు.ఈ సినిమాకు చిరంజీవి భారీగా రూ. 75 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇది మెగాస్టార్ కెరీర్‌లో అత్యధిక పారితోషికం. ఇప్పటికే మేకర్స్ చిరంజీవికి మొత్తం రెమ్యునరేషన్ చెల్లించారని సమాచారం.

ఈ సినిమాలో చిరు వింటేజ్‌ లుక్‌లో కనిపిస్తారనే వార్తలపై స్పందించిన శ్రీకాంత్‌ ఓదెల, తాను మెగాస్టార్‌ కోసం ప్రత్యేక కథను సిద్ధం చేస్తున్నానని వెల్లడించాడు. చిరు పాత్ర పూర్తిగా తన వయసుకు తగ్గట్టుగా ఉంటుందని, ఆయన అభిమానులకు కొత్తగా కనిపించేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పాడు.