లేడీ ఓరియెంటెడ్ సినిమాల హిట్టింగ్ స్ట్రీక్ .. !

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆసక్తి పెరుగుతుండటంతో, భవిష్యత్తులో మరిన్ని పవర్‌ఫుల్ కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకరిని మించి మరొకరు లేడీ బాస్‌గా నిలవాలని అనుకుంటున్నారు. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, మహిళల పాత్రలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి ఓ ప్రయత్నం. మునుపటి రోజుల్లో ఈ తరహా సినిమాలు నయనతార, అనుష్క శెట్టి వంటి కొద్దిమందికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి హీరోయిన్ తన సత్తా చాటడానికి లేడీ ఓరియెంటెడ్ కథలు ఎంచుకుంటోంది. […]