కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసిన కేటీఆర్ – యూజీసీ నిబంధనలపై అభ్యంతరాలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసినట్లు వెల్లడించారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిటీ (యూజీసీ) నిబంధనలను మార్చడం పై తమ అభ్యంతరాలను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశామని చెప్పారు. కేటీఆర్ మాట్లాడుతూ, కొన్ని నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించే విధంగా ఉన్నాయని, గవర్నర్లకు […]