జేసీ.. నోరు అదుపులో పెట్టుకో: బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

నటి, బీజేపీ నేత మాధవీలతపై టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తమ సంప్రదాయం లో భాగమైందా? అని ఆయన ప్రశ్నించారు. పార్థసారథి మాట్లాడుతూ, “మహిళలను గౌరవించే సంప్రదాయం కూడా లేకుండా, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి నాయకులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అశోభనంగా ఉంది. బీజేపీ నాయకులు బస్సులు కాల్చారని ఆరోపించడం తగదని” అన్నారు. […]