పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభంకాబోతున్న నేపథ్యంలో, జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఈ రోజు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాలను తన ఎమ్మెల్యేలకు వివరిస్తూ, అసెంబ్లీ పద్ధతులకు సంబంధించి కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సభలో మంత్రులు, సీనియర్ […]