చలికాలంలో వేడి నీళ్లు త్రాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో ..!

చలికాలంలో ఎక్కువ మంది వ్యక్తులు ఎముక నొప్పి, చర్మ సమస్యలు మరియు జీర్ణవ్యవస్థ సంబంధిత ఇబ్బందులతో బాధపడతారు. చల్లని గాలులు శరీరంలోని రక్త ప్రసరణను తగ్గించి, దాంతో చాలా శారీరక సమస్యలు మొదలవుతాయి. ఈ సీజన్‌లో ఆరోగ్య సమస్యలను నివారించడానికి మన దినచర్యలో కొన్ని సరైన మార్పులు చేయడం చాలా ముఖ్యం. అందులో ఒకటి, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం. ఈ సదుపాయం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.