మహా శివరాత్రి సందర్భంగా ఉచిత పండ్లు, అల్పాహారం పంపిణీ: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాల్లో భక్తులకు ఉచితంగా పండ్లు, అల్పాహారం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 13 న జరగనున్న మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. భక్తుల సేవ కోసం ప్రత్యేక ఏర్పాట్లు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ముఖ్యమైన శైవక్షేత్రాల్లో వేములవాడ, కాళేశ్వరం, కీసర, ఏడుపాయలు, రామప్ప, మేళ్లచెరువు, పానగళ్లు, […]