దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఇటీవల తీసుకున్న మానిటరీ పాలసీ నిర్ణయాలు ఇన్వెస్టర్లను పెద్దగా ఆకర్షించలేకపోయాయి. రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ, బ్యాంకుల్లో లిక్విడిటీ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ క్రమంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 197 పాయింట్లు నష్టపోయి 77,860 వద్ద స్థిరపడింది. […]