విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఊరట: 11,500 కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు జరుగుతున్న ప్రచారంపై కేంద్రం చెక్ పెట్టింది. నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను తిరిగి నిలబెట్టేందుకు కేంద్రం భారీగా మద్దతు ఇవ్వనుంది. దీంతో, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి కేంద్రం శుభవార్తను ప్రకటించింది. ఈ రోజు ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో, విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,500 కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించినట్లు కేంద్రం […]