సక్సెస్ కొట్టిన బాలయ్య, వెంకీ, నాగ్…చిరంజీవి హిట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

కొత్త ప్రయోగాలు లేవు… భారీ బడ్జెట్లూ కావు.. పాన్ ఇండియా సబ్జెక్టుల జోలికి వెళ్లడం లేదు అయినా సరే. తమ స్టామినా తో భారీ సక్సెస్ లు కొట్టేస్తున్నారు సీనియర్లు. మరీ మెగాస్టార్ ఎలా వస్తున్నాడు.. ఏ స్థాయి హిట్ కొట్టబోతున్నాడు. ఇప్పడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.. వాల్తేరు వీరయ్య అనంతరం మరో సాలీడ్ హిట్ కోసం మెగాభిమానులు వెయిట్ చెస్తున్నారు.వరుసగా మెగా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవటంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు.ఈ పరిస్దితుల్లో విశ్వంభర చిత్రం పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మళ్లీ ట్రాక్ ఎక్కారు. మధ్యలో వచ్చిన ప్లాపులను మురిపించేలా హిట్లను కొట్టేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు హీరోలు సక్సెస్ బాటపట్టగా… మరో హీరో హిట్ ఎప్పుడు కొడతాడా అని సినీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మ మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహం బాలకృష్ణ, విక్ట‌రీ వెంకటేష్, కింగ్ నాగార్జున.. దశాబ్ధాలుగా తెలుగు సినిమాను నాలుగు స్తంభాలుగా మోస్తున్న హీరోలు. కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నారు. కుర్ర డైరెక్టర్లతో కలిసి హిట్లను కొట్టేస్తున్నారు. ఈ […]