యంగ్ డైరెక్టర్స్ తో మెగాస్టార్ వరుస సినిమాలు

ఇటీవల మెగాస్టార్ మరో యంగ్ డైరెక్టర్‌తో కలిసి పని చేయనున్నారని టాలీవుడ్లో చర్చలు జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి “సంక్రాంతికి వస్తున్నాం” అనే ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ పై పని చేస్తున్నారు. ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవి కోసం ప్రత్యేకమైన కథను రెడీ చేస్తున్నారని సమాచారం.