పుష్ప 2 చూసిన వెంకీ..అల్లు అర్జున్ నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా..అంటూ పోస్ట్ !

విక్టరీ వెంకటేష్ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ, “అల్లు అర్జున్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఆయన నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా. దేశవ్యాప్తంగా ఈ మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో అసాధారణ ప్రదర్శన ఇచ్చింది. దర్శకుడు సుకుమార్ గారికి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మరియు చిత్ర బృందానికి నా అభినందనలు,” అని సోషల్ మీడియా లో తన అభిపార్యాయాన్ని తెలియజేసారు .. విక్టరీ వెంకటేష్ పుష్ప 2 ట్రేడ్ మార్క్ డైలాగ్ “అస్సలు తగ్గేదేలే” అంటూ చివర్లో క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.