పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద నాలుగు రోజుల్లో 829 కోట్ల వసూళ్లు

పుష్ప 2’ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే రూ. 294 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు రూ. 155 కోట్లు, మూడో రోజు శనివారం రూ. 172 కోట్లు కలిపి మూడు రోజుల్లో మొత్తం రూ. 621 కోట్లు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు ఆదివారం ఈ చిత్రం అసలు సిసలు ప్రభంజనాన్ని సృష్టించింది. ఒక్క రోజే రూ. 208 కోట్లు వసూలు చేసి, మొత్తం నాలుగు రోజుల్లో రూ. 829 కోట్ల వసూళ్లను సాధించింది.