అభిమానుల కోసం శుభవార్త 7/జి బృందావన్ కాలనీ సీక్వెల్ రెడీ!
సెల్వ రాఘవన్ 7/జి బృందావన్ కాలనీ 2ను అధికారికంగా ప్రకటించగా, దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇటీవల విడుదలైంది. ఈ పోస్టర్‌లో దర్శకుడు, సంగీత దర్శకుడు, కెమెరామెన్ పేర్లు మాత్రమే ఉండగా, నటీనటుల వివరాలు వెల్లడించలేదు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.