64 ఏళ్ల తాత, 68 ఏళ్ల బామ్మ వృద్ధాశ్రమంలో పెళ్లి

రాజమహేంద్రవరం: ఏపీలోని రాజమహేంద్రవరం వృద్ధాశ్రమంలో ఒక అరుదైన పెళ్లి జరిగింది. 64 ఏళ్ల నారాయణపురానికి చెందిన మడగల మూర్తి మరియు 68 ఏళ్ల గజ్జల రాములమ్మ, వృద్ధాశ్రమంలో జీవిస్తూ ఒకరినొకరు ఇష్టపడిన ఈ జంట, లేటు వయసులో పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో మడగల మూర్తి రెండు సంవత్సరాలుగా నివసిస్తున్నారు. అదే ఆశ్రమంలో పెనగలూరు మండలానికి చెందిన గజ్జల రాములమ్మ కూడా వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం మూర్తి పక్షవాతంతో తీవ్రంగా […]