హరిహరవీరమల్లుపై సాయి మాధవ్ బుర్రా కీలక వ్యాఖ్యలు క్రిష్ తో కలిసి నేను కూడా తప్పుకున్నాను!

అయితే, క్రిష్‌తో పాటు పాపులర్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా కూడా ఈ ప్రాజెక్ట్ నుండి బయటకెళ్లినట్లు తాజాగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “హరిహరవీరమల్లో క్రిష్ ఉన్నంత వరకు నేను కూడా ప్రాజెక్టులో ఉన్నాను. కానీ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయిన తర్వాత, నేను కూడా ఆయనతోపాటు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను” అని చెప్పారు. హరిహరవీరమల్లు గురించి చెప్పేందుకు ఆయన ఏమనుకుంటున్నారంటే, “హరిహరవీరమల్లు చాలా గొప్ప సబ్జెక్ట్. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎంత వేచి చూస్తున్నారో నేను కూడా ఆసక్తిగా ఉన్నాను,” అని తెలిపారు.