సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందన

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ రోజు ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలను ముంబై నగర పోలీస్ కమిషనర్, ఈ రోజు లేదా రేపు మీడియాకు తెలియజేస్తారని తెలిపారు. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తుండటంతో, ప్రస్తుతానికి ఈ కేసుపై ఊహాగానాలు చేయకూడదని ఫడ్నవీస్ సూచించారు. “పోలీసులు ఇంకా అన్ని విషయాలను వెల్లడించలేదు. ఏమైనా గందరగోళం సృష్టించకండి” అని ఆయన […]