సుప్రీంకోర్టులో బీఆర్ఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విచారణ: తదుపరి విచారణ 10వ తేదీకి వాయిదా

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణను జస్టిస్ బి.ఆర్. గవాయ్ మరియు జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం చేపట్టింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు. కేటీఆర్ వేసిన పిటిషన్‌ను, గతంలో దాఖలైన పిటిషన్లతో జతచేసి, ధర్మాసనం […]