నవ్వులు పంచేందుకు సిద్ధు ‘జాక్’ కామెడీ

సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్కేర్’ చిత్రం మంచి విజయాన్ని సాధించి, ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాక్-కొంచెం క్రాక్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కథానాయికగా వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. విడుదల తేదీ, పోస్టర్ విశేషాలు చిత్ర యూనిట్ ఇటీవల కీలక వివరాలను వెల్లడించింది. ‘జాక్-కొంచెం క్రాక్’ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. […]