‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్: విడుదల తేదీ మార్పు పై చర్చలు

వెంకటేష్ కథానాయకుడిగా నటించిన నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14న విడుదలైన తర్వాత 13 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, వెంకటేష్ సినీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నాయికలుగా నటించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. […]