వివాదాలుగా సినీటైటిల్స్ ,,, ఒకే పేరుతో రెండు సినీ టైటిల్స్ …కోలీవుడ్ లో మొదలైన చర్చ ..!

సినిమా టైటిల్‌ను రిపీట్‌ చేస్తూ సినిమాలు రావడం కామనే. అయితే ఇద్దరు హీరోలు నటించిన వేర్వేరు చిత్రాలకు ఒకే టైటిల్‌ పెట్టడం, ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో పైగా ఇద్దరికి 25వ సినిమాకు ఒకే టైటిల్స్‌ అనౌన్స్‌ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చర్చనీయాంశం అయింది. విజయ్‌ ఆంటోనీ నటిస్తున్న ‘శక్తి తిరుమగణ్‌’ ను తెలుగులో ‘పరాశక్తి’ టైటిల్‌ పెట్టడంతో పాటు సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ప్రకటించాడు. ఇటు శివకార్తీకేయన్‌ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి కూడా ‘పరాశక్తి’ అనే టైటిల్‌ను మేకర్స్‌ ఖరారు చేశారు. ఇప్పుడు కోలీవుడ్ లో పరాశక్తి టైటిల్ వివాదం వచ్చింది

ఏ సినిమాకైనా ముందుగా కావాల్సింది అదే. ప్రమోషన్ చేయాలన్నా… ఆడియెన్స్ నోళ్లలో నానాలన్నా.. అదే ముఖ్యం. అది లేకుంటే సినిమానే లేదు. అంతటి ముఖ్యమైన విషయమే సినిమాకు ప్రాబ్లంగా మారితే… అదే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే… ఎలా ఉంటుంది… కోలీవుడ్ లో ఓ రెండు సినిమాలకు ఇప్పుడు అదే కష్టం వచ్చింది. ఏ సినిమా ప్ర‌మోష‌న్ కైనా అత్యంత ముఖ్య‌మైన‌ది టైటిల్. దానితో స‌గం ప‌బ్లిసిటీ వ‌చ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మూవీకి స్టోరీ ఎంతో ముఖ్యమో.. టైటిల్ […]