శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు అక్రమ హోర్డింగులు తొలగించారు, కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు

రంగారెడ్డి జిల్లా, శంషాబాద్: హైడ్రా అధికారులు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులేని హోర్డింగులను తొలగించారు. బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగులను మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించడం జరిగింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన సుమారు 17 హోర్డింగులను అధికారులు గుర్తించారు. మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగి వాటిని తొలగించింది. అక్రమ హోర్డింగులపై చర్యలు కొనసాగిస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. అలాగే, హైడ్రా నిర్మాణ రంగ వ్యర్థాలు, […]